ఆసియాకప్-2023కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఎంపికయ్యాడు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు బంగ్లా కెప్టెన్సీ నుంచి తమీమ్ ఇక్భాల్ తప్పుకోవడంతో ఆ బాధ్యతలను షకీబ్‌కు సెలక్షన్ కమిటీ అప్పగించింది. అదే విధంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుంగా రాణిస్తున్న 22 ఏళ్ల తాంజిద్ హసన్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.
తాంజిద్ విషయానికి వస్తే.. ఇటీవల ముగిసిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఈ యువ ఆటగాడు మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. అదే విధంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ గత ఏడిషన్‌లో కూడా దుమ్ము రేపాడు. మరోవైపు ఈ జట్టులో వెటరన్ బ్యాటర్ మహ్ముదుల్లాకు చోటు దక్కలేదు.
అతడు చివరగా ఈ ఏడాది మార్చిలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక ఈ ఏడాది ఆసియాకప్ శ్రీలంక, పాకిస్తాన్‌ల వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది.
ఆసియాకప్‌కు బంగ్లా జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్మద్, మహిదీ హసన్, నసుమ్ అహ్మద్, షమీ అహ్మద్, షమీ అహ్మద్, ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్
చదవండి: అవన్నీ నిజం కాదు.. దయచేసి అర్ధం చేసుకోండి: విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment