
తొలి టెస్టులో టీమిండియా బంగ్లాదేశ్ ముందు 512 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా(102 నాటౌట్)తో పాటు ఓపెనర్ శుబ్‌మన్ గిల్(110 పరుగులు) సెంచరీలతో చెలరేగారు.
అంతకముందు టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. ముష్పికర్ రహీమ్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీయగా.. సిరాజ్ 3, ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్‌లు చెరొక వికెట్ తీశారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.