
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా విజయం దిశగా పయనిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 231 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమిండియా టార్గెట్ 145 పరుగులుగా ఉంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ 71 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. జాకీర్ హసన్ 51 పరుగులు చేశాడు. ఇక నురుల్ హసన్, తస్కిన్ అహ్మద్‌లు తలా 31 పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, అశ్విన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వికెట్ నష్టానికి మూడు పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో నురుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉండడం.. టార్గెట్ చిన్నది కావడంతో టీమిండియా విజయం దాదాపు ఖరారైనట్లే.
Comments
Please login to add a commentAdd a comment