T20 WC 2022: Indian Fans Brutally Troll Shakib Al Hasan For Bizarre Statement Ahead Of India Match - Sakshi
Sakshi News home page

T20 WC 2022: అంతన్నావు.. ఇంతన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్‌?

Published Thu, Nov 3 2022 9:25 AM | Last Updated on Thu, Nov 3 2022 11:23 AM

Indian fans brutally troll Shakib for bizarre statement ahead of India match - Sakshi

 ICC Mens T20 World Cup 2022 : టీమిండియాతో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ ఆల్‌ హసన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాము టైటిల్ గెలవడానికి రాలేదని, టీమిండియాను మాత్రం ఓడించితీరతామని అని షకీబ్‌ కామెంట్‌ చేశాడు. అయితే బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో షకీబ్‌ బాల్‌తో పర్వాలేదనిపించినప్పటికీ.. బ్యాట్‌తో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.

ఈ మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన షకీబ్‌ 12 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో కెప్టెన్‌ షకీబ్‌ ఆల్‌ హాసన్‌ను భారత అభిమానులు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. సోషల్‌మీడియాలో షకీబ్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. "అంత అన్నావు.. ఇంత అన్నావు! ఇప్పుడు ఏమైంది షకీబ్‌? అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఓ యూజర్‌ స్పందిస్తూ.. " ఇప్పుడు నాగిన్‌ డ్యాన్స్‌ ఆడు షకీబ్‌" అంటూ కామెం‍ట్‌ చేశాడు. అదే విధంగా గతంలో ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో అంపైర్‌పై షకీబ్‌ దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియోను కూడా నెటిజన్లు ట్రెండ్‌ చేస్తున్నారు.  ప్రస్తుతం ట్విటర్‌లో షకీబ్‌ పేరు ట్రెండ్‌ అవుతోంది.


చదవండి: T20 WC 2022: ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి సరి కొత్త చరిత్ర.. సచిన్‌ రికార్డు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement