
టీ20 వరల్డ్‌కప్-2024కు టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఇప్పటికే అమెరికాకు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా శనివారం(జూన్ 1న) బంగ్లాదేశ్‌తో వార్మాప్ మ్యాచ్ ఆడనుంది.
ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ ఒక అద్భుతమైన కెప్టెన్ అని, ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉందని షకీబ్ కొనియాడాడు.
"రోహిత్ శర్మ భారత జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడి కెప్టెన్సీ స్కిల్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కెప్టెన్‌గా అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. రోహిత్ జట్టులో ఆటగాళ్లందరని సమానంగా చూస్తాడు. తన సహచర ఆటగాళ్లు కూడా రోహిత్‌ను అంతే గౌరవిస్తారు. రోహిత్ ఒక వరల్డ్ క్లాస్ బ్యాటర్. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా రోహిత్‌కు ఉందని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీబ్ పేర్కొన్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రోహిత్‌కు బంగ్లాదేశ్‌పై వన్డేలు, టీ20లు రెండింటిలోనూ అద్భుతమైన రికార్డు ఉంది. బంగ్లాపై 12 టీ20 ఇన్నింగ్స్‌లలో 37.83 సగటుతో 454 పరుగులు చేశాడు. అదే విధంగా 17 వన్డే ఇన్నింగ్స్‌లలో 56.14 సగటుతో 786 పరుగులు సాధించాడు. కాగా షకీబ్, రోహిత్ ఇద్దరే 2007 అరంగేట్ర టీ20 వరల్డ్‌కప్ నుంచి కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment