
బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన షకీబ్.. రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ తరఫున నామినేషన్ వేసేందుకు షకీబ్ సిద్దమవుతున్నాడు.
ఇప్పటికే బీఏఎల్ నుంచి ఇప్పటికే మూడు సెట్ల నామినేషన్ పత్రాలను తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీఏఎల్ సంయుక్త కార్యదర్శి బహుద్దిన్ నసీమ్ ధృవీకరించారు. "షకీబ్ ఒక సెలబ్రిటీ, అతడు బంగ్లా యువతలో మంచి పాపులారిటీని కలిగి ఉన్నాడు.
మా పార్టీ నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు" అని నసీమ్ ఓ స్దానిక న్యూస్ ఛానల్‌తో పేర్కొన్నారు. ఇప్పటికే అధికార పార్టీ తరఫున షకిబ్ అభ్యర్థిత్వాన్ని బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా ధ్రువీకరించారు.
చదవండి: CWC Final: వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్ షా అఫ్రిది పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment