
ఛాటోగ్రామ్ వేదికగా భారత్‌తో జరుగతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 254 పరగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక 133-8 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్.. ఆదనంగా మరో 17 పరుగులు చేసి ఆలౌటైంది.
భారత వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు కీలక వికెట్ల పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, అశ్విన్ తలా వికెట్ సాధించారు.
ఇక బంగ్లాదేశ్ బ్యాటర్లలో ముషిఫికర్ రహీం 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. భారత బ్యాటర్లో ఛతేశ్వర్ పుజారా(90), శ్రేయస్ అయ్యర్(86) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.
చదవండి: తొలి మ్యాచ్‌లోనే కొడుకు సెంచరీ.. సచిన్ టెండూల్కర్ ఎమన్నాడంటే?