
ఫైల్ ఫోటో
ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్లు షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్‌లు దూరం కానున్నారు. స్వదేశంలో ఐర్లాండ్ సిరీస్ నేపథ్యంలో.. ఐపీఎల్‌లో పాల్గొనేందుకు షకీబ్, లిటన్ దాస్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేయలేదు.
ఐర్లాండ్ బంగ్లా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ సుదీర్ఘ సిరీస్ మార్చి 18 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనుంది. అనంతరం బంగ్లా ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలతో కలిసే అవకాశం ఉంది.
కాగా ఇప్పటికే కేకేఆర్ తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సేవలను కోల్పోగా.. ఇప్పడు షకీబ్, లిటన్ దాస్ దూరం కావడం నిజంగా బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. అదే విధంగా గాయపడిన శ్రేయస్ స్థానంలో షకీబ్‌ను తమ కెప్టెన్‌గా ఎంపిక చేయాలని కేకేఆర్ మెనెజెమెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో షకీబ్ కూడా దూరం కావడంతో కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడాతరన్నది వేచి చూడాలి. కాగా ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
చదవండి: IND vs AUS: హార్దిక్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment