Asia Cup 2023- India Vs Bangladesh: ఆసియా కప్-2023 సూపర్-4 ఆఖరి మ్యాచ్‌లో టీమిండియాకు అనూహ్య రీతిలో ఓటమి ఎదురైంది. పాకిస్తాన్‌ను ఏకంగా 228 పరుగులతో చిత్తు చేసి.. శ్రీలంకపై 41 పరుగులతో గెలుపొందిన రోహిత్ సేన బంగ్లాదేశ్ చేతిలో భంగపడింది. ఫైనల్‌కు ప్రాక్టీస్ అనుకున్న మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.
అదరగొట్టిన బంగ్లా కెప్టెన్
కొలంబోలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. షకీబ్ అల్ హసన్ బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కెప్టెన్ షకీబ్ 80, తౌహిద్ హృదయ్ 54, నసైమ అహ్మద్ 44 పరుగులతో రాణించారు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు స్కోరు చేసింది.
రోహిత్ డకౌట్
అయితే, లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఊహించని షాకిచ్చాడు బంగ్లా అరంగేట్ర బౌలర్ తంజీమ్ హసన్ సకీబ్. రెండు బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఈ రైట్‌ఆర్మ్ పేసర్ బౌలింగ్‌లో అనాముల్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు.
గిల్ సెంచరీ, అక్షర్ ఇన్నింగ్స్ వృథా
మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 121, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 42 పరుగులతో రాణించినా.. భారత్ గెలుపునకు ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా.. రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
రోహిత్ శర్మ చెత్త రికార్డు
ఆసియా వన్డే కప్ చరిత్రలో అత్యధిక సార్లు(3) డకౌట్ అయిన తొలి భారత బ్యాటర్, కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ టోర్నీలో పరుగుల ఖాతా తెరవకుండానే మూడుసార్లు పెవిలియన్ చేరిన ఐదో క్రికెటర్‌గా చెత్త రికార్డు జాబితాలోకెక్కాడు.ఇదిలా ఉంటే.. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ డకౌట్ కావడం ఇది ఏకంగా పదిహేనోసారి కావడం గమనార్హం.
ఆసియా వన్డే కప్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన క్రికెటర్లు
►రూబెల్ హసన్(బంగ్లాదేశ్)-3
►సల్మాన్ భట్(పాకిస్తాన్)-3
►అమీనుల్ ఇస్లాం(బంగ్లాదేశ్)-3
►మహేళ జయవర్ధనే(శ్రీలంక)-3
►రోహిత్ శర్మ(ఇండియా)-3.
చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ
Super11 Asia Cup 2023 | Super 4 | India vs Bangladesh | Highlightshttps://t.co/hEYw3GY8qd#AsiaCup2023
— AsianCricketCouncil (@ACCMedia1) September 15, 2023
Comments
Please login to add a commentAdd a comment