
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఓ హత్యకు సంబంధించి షకీబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న నిరసనలలో ఆగస్టు 7న గార్మెంట్ వర్కర్ ఎండీ రూబెల్ మరణించాడు.
అయితే తాజాగా తన కుమారుడని ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం ఢాకాలోని అడాబోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే షకీబ్‌తో పాటు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సహా మొత్తం 500 మందిపై పోలీసులు కేసు ఫైల్ చేసినట్లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఈ కేసులో షకీబ్‌ను 28వ నిందితుడిగా పేర్కొనగా.. ప్రముఖ బంగ్లాదేశ్ నటుడు ఫెర్దౌస్ అహ్మద్ 55వ నిందితుడిగా ఉన్నాడు. కాగా వీరిద్దరూ బంగ్లా పార్లమెంట్‌లో మాజీ అవామీ లీగ్ ఎంపీలు కావడం గమనార్హం. ఇక షకీబ్ అల్‌హసన్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ టెస్టు జట్టులో ఉన్నాడు.
అయితే కేసు నమోదు కావడంతో అతడు స్వదేశానికి తిరిగి వెళ్లే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో అతడు పాక్‌తో జరిగే రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో హింసత్మాక సంఘటనలు కొనసాగుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికి పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు.
Comments
Please login to add a commentAdd a comment