శ్రీలంక క్రికెటర్ల విజయోత్సాహం
ఢాకా: బంగ్లాదేశ్, జింబాబ్వేలతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో శ్రీలంక విజేతగా నిలిచింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక 79 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌ను 41.1 ఓవర్లలో 142 పరుగులకే పరిమితం చేసిన లంకేయులు ట్రై సిరీస్‌ను చేజిక్కించుకున్నారు. బంగ్లా ఆటగాళ్లలో మొహ్మదుల్లా(76) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిచిపించలేకపోయాడు. బంగ్లా ఆటగాళ్లలో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో భారీ ఓటమి తప్పలేదు. శ్రీలంక బౌలర్లలో మదుషనక హ్యాట్రిక్ వికెట్లతో బంగ్లాను కట్టడి చేయగా, చమీరా, అకిల ధనంజయలు తలో రెండు వికెట్లు తీసి విజయంలో తమ పాత్రను సమర్దవంతంగా నిర్వర్తించారు. బంగ్లాదేశ్ ఇన‍్నింగ్స్‌లో రెండు రనౌట్లు ఉండగా, షకిబుల్ హసన్ ఆబ్సెంట్ హర్ట్ అయ్యాడు.
అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటయ్యారు. ఉపుల్ తరంగా(56), కుశాల్ మెండిస్(28), నిరోషన్ డిక్వెల్లా(42), దినేశ్ చండిమాల్(45)లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment