సింగపూర్: అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని సింగపూర్ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సింగపూర్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సభ్యత్వం గల దేశంపై తొలి విజయాన్ని అందుకుని నయా రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించడంతో 18 ఓవర్లకు కుదించారు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన సింగపూర్ తొమ్మిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.(ఇక్కడ చదవండి: టీ20లో సరికొత్త రికార్డు)
టిమ్ డేవిడ్(41), మన్‌ప్రీత్ సింగ్(41)లు రాణించడంతో చాలెంజింగ్ స్కోరును జింబాబ్వే ముందుంచుంది. కాగా, జింబాబ్వే 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి ఓటమి పాలైంది. జింబాబ్వే కెప్టెన్ సీమ్ విలియమ్స్(66), ముటోంబోడ్జి(32)లు రాణించినా ఆ జట్టును విజయం అందించలేకపోయారు. సింగపూర్ బౌలర్లలో మహబూబ్, జనక్ ప‍్రకాశ్ తలో రెండు వికెట్లు సాధించగా, విజయ్ కుమార్, గోపీనాథ్ ఆచర్‌లు చెరో వికెట్ తీశారు. సింగపూర్ తాజా విజయంతో రెండు పాయింట్లు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment