పాకిస్తాన్
అబుదాబి: బాబర్ ఆజమ్ (55 బంతుల్లో 68; 5 ఫోర్లు, 1 సిక్స్), ఇమాద్ వసీమ్ (3/20) రాణిం చడంతో పాకిస్తాన్ పొట్టి ఫార్మాట్‌లో ఆసీస్‌పై భారీ విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన తొలి టి20లో పాకిస్తాన్ 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ జూలైలో హరారేలో 45 పరుగుల తేడాతో గెలిచిన రికార్డును సవరించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బాబర్‌తో పాటు వన్‌డౌన్‌లో దిగిన మొహమ్మద్ హఫీజ్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు.
105 పరుగుల వరకు ఒకే వికెట్‌ను కోల్పోయిన పాక్ మరో 28 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లను కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో స్టాన్‌లేక్, ఆండ్రూ టై మూడేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో ఆసీస్ 16.5 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. తొలి ఓవర్లోనే ఓపెనర్లు ఫించ్ (0), షార్ట్ (4)లను వసీమ్ ఔట్ చేశాడు. పవర్ ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా 22 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయి ఓటమికి సిద్ధమైంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కూల్టర్‌నీల్ (29 బంతుల్లో 34; 6 ఫోర్లు) కాస్త ప్రతిఘటించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధ్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment