బ్రిస్బేన్: పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్, 5 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. 64/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 84.2 ఓవర్లలో 335 పరుగుల వద్ద ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (104; 13 ఫోర్లు) అసాధారణ పోరాటంతో సెంచరీ సాధించాడు. 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాక్‌ను బాబర్ ఆదుకునే ప్రయత్నం చేశాడు.
వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (95; 10 ఫోర్లు)తో కలిసి పాక్ పరువు నిలిపే పోరాటం చేశాడు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 132 పరుగులు జతచేశారు. సెంచరీ పూర్తయిన వెంటనే బాబర్ నిష్క్రమించగా, రిజ్వాన్ శతకం చేజార్చుకున్నాడు. రిజ్వా న్, యాసిర్ షా (42)లను హాజల్‌వుడ్ అవుట్ చేయడంతో ఇన్నింగ్స్ ఎం తో సేపు నిలువలేదు. హాజల్‌వుడ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు 29 నుంచి అడిలైడ్‌లో జరుగుతుంది
Comments
Please login to add a commentAdd a comment