ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 10-05-2026 To 16-05-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

May 10 2026 4:09 AM | Updated on May 10 2026 10:45 AM

Weekly Horoscope Telugu 10-05-2026 To 16-05-2026

మేషం....
బంధువుల ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు.  ప్రముఖులను మీ నైపుణ్యంతో ఆకట్టుకుంటారు.  సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో  సమస్యలు. పసుపు, ఎరుపు రంగులు.  విష్ణుధ్యానం చేయండి.

వృషభం...
ఆప్తుల ద్వారా శుభవార్తలు అందుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. తెలివిగా కొన్ని వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. రుణభారాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ మనోగతాన్ని, జ్ఢాపకాలను పంచుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. గులాబీ, పసుపు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

మిథునం....
కుటుంబసమస్యల నుండి బయటపడతారు. మీకు సరైన సమయంలో మిత్రులు సహకరిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా నేర్పుగా ఆకట్టుకుంటారు. కుటుంబంలో  శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొత్త విధులు దక్కుతాయి. వైద్యులు, కళాకారులకు మరింత ఉత్సాహంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. సూర్యాష్టకం పఠించండి.

కర్కాటకం...
ఆర్థిక వ్యవహారాలు  సంతృప్తినిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు మీకు మరింత సహాయపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.æ ఆటంకాలు అధిగమిస్తూ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు.  క్రీడాకారులు, రాజకీయవేత్తలకు మరింత  ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఎరుపు, తెలుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం...
పనులు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు  సానుకూలమవుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. సోదరులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో  ముందడుగు వేస్తారు,  ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.  పారిశ్రామిక, కళారంగాల వారికి అన్నివిధాలుగా అనుకూలం. వారం చివరిలో సోదరులతో అకారణంగా వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒత్తిడులు పెరుగుతాయి. ఎరుపు, బంగారు రంగులు. హæనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కన్య...
ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది. మీ ప్రతిపాదనలు కార్యరూపంలో పెడతారు. అనుకున్న పనులు కొంత నిదానంగా సాగుతాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ముఖ్య మార్పులు జరుగవచ్చు.. వైద్యులు, రాజకీయవర్గాలకు విశేష గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. వివాదాలు. గులాబీ, ఆకుపచ్చరంగులు, శివాష్టకం పఠించండి.

తుల...
ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలలో  పురోగతి ఉంటుంది. బం«ధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు రావచ్చు. క్రీడాకారులు, రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో మిత్రులతో  విభేదాలు. ధన వ్యయం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం...
ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. మిత్రులతో విభేదాలు పరిష్కారం. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.  శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సజావుగా నిర్వహిస్తారు. క్రీడాకారులు,  రాజకీయవేత్తలకు  శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ధనవ్యయం. ఆకుపచ్చ, గులాబీ రంగులు.  లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
కుటుంబబాధ్యతలు మరింత పెరిగి సతమతమవుతారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సమాజసేవా కార్యక్రమాలు చేపడతారు. మిత్రులతో విరోధాలు నెలకొంటాయి. ఆరోగ్యంపై కొంత  శ్రద్ధ వహించండి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాలలో అదనపు పనిభారం. వైద్యులు, రాజకీయవర్గాల ఆశలు ఫలించవు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, నేరేడురంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

మకరం...
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణ విముక్తులవుతారు. పనులు  అనుకున్న విధంగా పూర్తి కాగలవు. బంధువుల ద్వారా ముఖ్య సమాచారం రాగలదు.  నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో  ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో  బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. క్రీడాకారులు,  కళాకారులకు గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. నలుపు, ఆకుపచ్చ రంగులు.  దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం...
శ్రమ ఫలించే సమయం. ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఊహించని∙విద్యావకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం, కొన్ని అనుకూల మార్పులు ఉండవచ్చు. క్రీడాకారులు, రాజకీయవర్గాలకు కొన్ని పదవులు ఊరిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. ఎరుపు, తెలుపు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మీనం...
ఆర్థికంగా ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఆప్తులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజసేవలో పాలుపంచుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూవివాదాలు తీరతాయి. కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు.మిత్రులను కలుసుకుని మీ ఆభిప్రాయాలను పంచుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడిæ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనితీరును అందరూ గుర్తిస్తారు. కళాకారులు, వైద్యులకు మరింత ఉత్సాహం. అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు, ధనవ్యయం. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చరంగులు. గణేశాష్టకం పఠించండి.

Advertisement
 
Advertisement
Advertisement