
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్, జోఫ్రా ఆర్చర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో ఆర్చర్‌కు ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు.
తొలి ఓవర్ లోనే 23 పరుగులు ఇచ్చిన ఆర్చర్.. ఆ తర్వాత మూడు ఓవర్లలో వరుసగా 12, 22,23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ఆర్చర్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా ఆర్చర్ రికార్డులకెక్కాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వెటరన్ పేసర్ మొహిత్ శర్మ పేరిట ఉండేది. ఐపీఎల్-2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన మోహిత్ శర్మ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 పరుగులు ఇచ్చాడు. తాజా మ్యాచ్‌తో మొహిత్ రికార్డును ఆర్చర్(78) బ్రేక్ చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్తాన్‌పై 44 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ఇషాన్ కిషన్(106 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. కిషన్‌తో పాటు ట్రావిస్ హెడ్(67), క్లాసెన్(34), నితీశ్ కుమార్(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించారు.
అనంతరం 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీ, జంపా చెరో వికెట్ సాధించారు. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
Comments
Please login to add a commentAdd a comment