
ఐపీఎల్-2024లో వరుస ఓటుమల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగుల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది.
213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్.. సీఎస్‌కే బౌలర్ల దాటికి 134 పరుగులకే కుప్పకూలింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో మార్‌క్రమ్(32) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా అందరూ విఫలమయ్యారు.
సీఎస్‌కే బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముస్తఫిజుర్ రెహ్మాన్, పతిరనా తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు జడేజా, శార్ధూల్ చెరో వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment