IPL 2024 SRH vs CSK Live Updates:
సీఎస్‌కేను చిత్తు చేసిన సన్‌రైజర్స్..
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఐడైన్ మార్‌క్రమ్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(37), ట్రావిస్ హెడ్(31) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్‌కే బౌలర్లలో మొయిన్ అలీ రెండు వికెట్లు, దీపక్ చాహర్, థీక్షణ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబే(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రహానే(35), జడేజా(31) పరుగులతో రాణించాడు.. ఇక ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, పాట్ కమ్మిన్స్, జయ్‌దేవ్ ఉనద్కట్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.
నాలుగో వికెట్ డౌన్.. ఆహ్మద్ ఔట్
షాబాజ్ అహ్మద్ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన అహ్మద్.. మొయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ రెడ్డి వచ్చాడు.
మూడో వికెట్ డౌన్.. మార్‌క్రమ్ ఔట్
ఐడైన్ మార్‌క్రమ్ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన మార్‌క్రమ్.. మొయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. క్రీజులోకి క్లాసెన్ వచ్చాడు. 14 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 132/3
ఎస్‌ఆర్‌హెచ్ రెండో వికెట్ డౌన్..
106 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. మహేష్ థీక్షణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 112/2
6 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ : 78/1
6 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్ వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(24), ఐడైన్ మార్‌క్రమ్(15) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్..
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 37 పరుగులతో మంచి టచ్‌లో కన్పించిన అభిషేక్ శర్మ.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అభిషేక్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. 3 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 46/1
ఎస్‌ఆర్‌హెచ్ టార్గెట్ 166 పరుగులు
హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబే(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రహానే(35), జడేజా(31) పరుగులతో రాణించాడు.. ఇక ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, పాట్ కమ్మిన్స్, జయ్‌దేవ్ ఉనద్కట్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.
నాలుగో వికెట్ డౌన్..
127 పరుగుల వద్ద సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన అజింక్య రహానే.. జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
సీఎస్‌కే మూడో వికెట్ డౌన్..
118 పరుగుల వద్ద సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన శివమ్ దూబే.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 14 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 120/3
11 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 90/2
11 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే(21), శివమ్ దూబే(29) పరుగులతో ఉన్నారు.
సీఎస్‌కే రెండో వికెట్ డౌన్.. గైక్వాడ్ ఔట్
54 పరుగుల వద్ద సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు.
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..
25 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అజింక్య రహానే వచ్చాడు. 4 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 26/1
2 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 13/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(6), రచిన్ రవీంద్ర(7) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఏకంగా 3 మార్పులతో బరిలోకి దిగింది. ముస్తఫిజర్ రెహ్మన్, మతీషా పతిరాన,సమీర్ రిజ్వీ దూరమయ్యారు.
వీరి స్ధానంలో థీక్షణ, ముఖేష్ చౌదరి, మొయిన్ అలీ వచ్చాడు. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ కూడా రెండు మార్పులు చేసింది. జట్టులోకి ఆంధ్ర ఆటగాడు నితీష్ రెడ్డి వచ్చాడు. అతడితో పాటు నటరాజన్‌కు చోటు దక్కింది.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్
Comments
Please login to add a commentAdd a comment