
ఐపీఎల్-2024లో చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు. 19వ ఓవర్‌లో నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గైక్వాడ్ ఔటయ్యాడు.
ఇక సీఎస్‌కే బ్యాటర్లలో గైక్వాడ్‌తో పాటు మిచెల్(52), శివమ్ దూబే(39 నాటౌట్) పరుగులతో రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు అందరూ పూర్తిగా తేలిపోయారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనద్కట్ తలా వికెట్ సాధించారు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్,నటరాజన్ ఇద్దరి కలిసి ఏకంగా 92 పరుగులు సమర్పించుకున్నారు.