ఐపీఎల్-2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ ఏడాది ఎడిషన్‌లో సగం పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గత సీజన్‌లో నిరాశపరిచిన రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ ఏడాది సీజన్‌లో దుమ్ములేపుతున్నాయి.
ప్రస్తుతం పాయింట్ల పట్టిక టాప్-4లో రాజస్తాన్ రాయల్స్ 14 పాయింట్లతో అగ్ర స్ధానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత స్ధానాల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఐదో స్ధానంలో నిలిచింది.
అయితే 7 విజయాలతో తొలి స్ధానంలో ఉన్న రాజస్తాన్ మరో మ్యాచ్‌లో విజయం సాధిస్తే తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకున్నట్లే. మిగిలిన మూడు స్ధానాలు కోసం మిగితా 9 జట్లు పోటీపడనున్నాయి. అందులో ఆఖరి స్ధానంలో ఉన్న ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు చేరే దారులు దాదాపు మూసుకుపోయినట్లే.
ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే అద్బుతాలు జరిగాలి. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లను భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అంచనా వేశాడు. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయని సిద్దూ జోస్యం చెప్పాడు.
నాలుగో స్ధానం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడతాయని సిద్దూ స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దూ పేర్కొన్నాడు. అయితే పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో లక్నో సూపర్ జెయింట్స్‌ను సిద్దూ ఎంపిక చేయకపోవడం గమనార్హం. కాగా ముంబై ఇండియన్స్ పాయింట్ల టేబుల్‌లో ప్రస్తుతం 8వ స్ధానంలో ఉంది. అటువంటిది ముంబై ఇండియన్స్‌ను సిద్దూ ఎంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment