ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌న్యూస్‌.. చెపాక్‌లో దుమ్ములేపిన ఆల్‌రౌండర్‌ | SRH may have landed steal deal With Brydon Carse for IPL 2025 | Sakshi
Sakshi News home page

IPL 2025: ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌న్యూస్‌.. చెపాక్‌లో దుమ్ములేపిన ఆల్‌రౌండర్‌

Published Sun, Jan 26 2025 9:27 AM | Last Updated on Sun, Jan 26 2025 10:40 AM

SRH may have landed steal deal With Brydon Carse for IPL 2025

చెన్నై వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓట‌మి చ‌విచూసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓట‌మి పాలైన‌ప్ప‌టికి ఆ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ బ్రైడన్ కార్స్(Brydon Carse) త‌న అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ దుమ్ములేపాడు.

ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్ వ‌చ్చిన కార్స్‌.. భార‌త బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. కేవలం 17 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్త్తో 31 పరుగులు చేశాడు. 29 ఏళ్ల కార్స్‌ దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. లేదంటే ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ సాధించిండేది. కార్స్‌ బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌న్యూస్‌..
కాగా బ్రైడన్ కార్స్ భారత గడ్డపై ఈ తరహా ప్రదర్శన చేయడం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్‌-2025 మెగా వేలంలో కార్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ కేవలం రూ. కోటిరూపయాలకే సొంతం చేసుకుంది. భారత్ పిచ్‌లపై తొలిసారి ఆడినప్పటికి ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా అందరిని కార్స్ మెప్పించాడు. కార్స్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడాడు.

మొత్తంగా 9 వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడిన అనుభవం మాత్రం అతడికి ఉంది. సౌతాఫ్రికా టీ20,  ది హండ్రెడ్,  వైటాలిటీ బ్లాస్ట్‌లో ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆడాడు. కాగా ఎస్ఆర్‌హెచ్‌లో ఇప్ప‌టికే నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శ‌ర్మ, ప్యాట్ క‌మ్మిన్స్ వంటి అద్భుత‌మైన ఆల్‌రౌండ‌ర్లు ఉన్నారు. ఇప్పుడు కార్స్ రాకతో ఎస్‌ఆర్‌హెచ్ ఆల్‌రౌండ్ విభాగం మరింత పటిష్టంగా మారింది.

ఐపీఎల్‌-2025కు ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు:  పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్ , రాహుల్ చాహర్, ఆడమ్ జంపా , అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్ , అనికేత్ వర్మ , ఎషాన్ మలింగ , సచిన్ బేబీ.
చదవండి: IND vs ENG: తిలక్‌ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement