ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
215 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్ బౌలర్లకు అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 209.42 స్ట్రైక్ రేటుతో 467 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు.
ప్రస్తుత సీజన్‌లో అభిషేక్ 41 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2016 సీజన్‌లో కోహ్లి 38 సిక్స్‌లు బాదాడు. తాజా సీజన్‌తో విరాట్ ఆల్‌టైమ్ రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment