ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవి చూసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్,బౌలింగ్ రెండింటిలోనూ సన్‌రైజర్స్ విఫలమైంది.
163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. ఇది ఎస్‌ఆర్‌హెచ్‌కు రెండో ఓటమి కావడం గమనార్హం. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ పరంగా తాము విఫలమయ్యామని కమ్మిన్స్ తెలిపాడు.
"ఆటలో గెలుపుటములు సహజం. ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడాం. మేము తొలుత బ్యాటింగ్‌లో 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్ధితి మరో విధంగా ఉండేది. కానీ గుజరాత్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మేము వరుస క్రమంలో వికెట్ల కోల్పోయాం. కనీసంలో మాలో ఎవరో ఒకరైనా ఫిప్టీ ప్లస్ స్కోర్ సాధించింటే బాగుండేది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో మేము బాగా బ్యాటింగ్ చేశాము. కానీ ఈ మ్యాచ్‌లో మా ప్రణాళిలకను అమలు చేయడంలో విఫలమయ్యాం. ఈ రోజు పిచ్ కూడా బాగానే ఉంది. తొలుత వికెట్ కొంచెం స్లోగా ఉంటుందని భావించాము. కానీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ ఒకేలా ఉంది. మా తర్వాతి మ్యాచ్‌ల్లో తిరిగి పుంజుకుంటామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment