స్వదేశంలో టీమిండియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యలతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డే సిరీస్‌కు దూరమైన విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ టీ20లకు అందుబాటులోకి వచ్చింది. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో పూరన్‌కు చోటు దక్కింది. అమెరికా వేదికగా జరిగిన మెజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బీజీబీజీగా ఉన్న పూరన్.. భారత్‌తో వన్డేల నుంచి తప్పుకున్నాడు.
అయితే ఈ టోర్నీ సోమవారం(జూలై31)తో ముగియడంతో పూరన్ తన సొంత జట్టుతో కలవనున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో పూరన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లోనే 137 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు.
ఆ ముగ్గురు ఎంట్రీ..
అదే విధంగా దాదాపు ఏడాది నుంచి విండీస్ టీ20 జట్టుకు దూరంగా ఉన్న షెమ్రాన్ హెట్‌మైర్, వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్, బౌలర్ థామస్‌కు కూడా సెలక్టర్లు పిలుపునిచ్చారు. వీరు ముగ్గురు చివరగా గతేడాది న్యూజిలాండ్‌పై టీ20ల్లో ఆడారు. ఆగస్టు1న ట్రినిడాడ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఇక ప్రస్తుతం భారత్-విండీస్ మధ్య వన్డే సిరీస్ హోరాహోరీగా జరుగుతోంది. మంగళవారం ట్రినిడాడ్ వేదికగా జరగనున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి.
వెస్టిండీస్ టీ20 జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్, రొమారియో షెఫెర్డ్ ఓడియన్ స్మిత్, ఒషానే థామస్.
భారత టీ20 జట్టు: ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
చదవండి: LPL 2023: మ్యాచ్ మధ్యలో పాము కలకలం.. ఉలిక్కిపడిన క్రికెటర్లు! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment