స్వదేశంలో టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌కు ఆ జట్టు స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్, ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ దూరమయ్యారు. పూరన్ అమెరికా వేదికగా జరగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బీజీగా ఉండడతో ఈ వన్డే సిరీస్‌కు అందుబాటులో లేడు. మరోవైపు హోల్డర్‌కు విండీస్ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్‌తో విండీస్ విధ్వంసకర ఆటగాడు షిమ్రాన్ హెట్‌మైర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. విండీస్ క్రికెట్ బోర్డ్‌తో విభేదాల కారణంగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు హెట్‌మైర్ దూరంగా ఉన్నాడు.
అతడు చివరగా 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కరేబియన్ జట్టు తరపున కనిపించాడు. అదే విధంగా వన్డేల్లో అయితే 2021లో ఆస్ట్రేలియాపై ఆడాడు. ఇక అతడితో పాటు పేసర్ ఒషానే థామస్‌కు ఛానాళ్ల తర్వాత విండీస్ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు దూరమైన లెగ్ స్పిన్నర్ గుడ్‌కేష్ మోటి కూడా ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక జూలై 27న బార్బడోస్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ మొదలు కానుంది.
టెస్టు సిరీస్ టీమిండియాదే..
ఇక రెండో టెస్టులో విండీస్‌ను ఓడించి.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామన్న టీమిండియా కలనేరవేరలేదు. వర్షం కారణంగా రెండో టెస్టు ఐదో రోజు ఒక్క బంతి కూడా వేయకుండా ఆట రద్దయ్యింది. తొలి టెస్టు గెలిచిన భారత్ సిరీస్‌ను 1–0తో సొంతం చేసుకుంది.
భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, యానిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, జైడెన్ సిన్సీల్స్, రొమారియోక్ల్ సీల్స్.
చదవండి: Ind Vs WI 2nd Test Day 5: వదలని వాన... రెండో టెస్టు డ్రా! సిరీస్ భారత్‌దే
Comments
Please login to add a commentAdd a comment