నికోలస్ పూరన్- శిఖర్ ధావన్
India tour of West Indies, 2022: వెస్టిండీస్‌తో వన్డే పోరుకు టీమిండియా సిద్ధమైంది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం జరుగనుంది. విజయంతో ఈ సిరీస్‌ను ఆరంభించి విండీస్‌పై జైత్రయాత్రను కొనసాగించాలని భారత జట్టు భావిస్తుండగా.. సొంతగడ్డపై తమకున్న చెత్త రికార్డును చెరిపేసుకోవాలని పూరన్ బృందం పట్టుదలగా ఉంది.
'West Indies is a great opportunity for the youngsters to get exposure and play, says #TeamIndia ODI Captain @SDhawan25 ahead of #WIvIND series. pic.twitter.com/PBelvII28c
— BCCI (@BCCI) July 21, 2022
ఈ నేపథ్యంలో ఇరు జట్ల రికార్డులు, పిచ్, వాతావరణం, తుది జట్ల అంచనా, మ్యాచ్ సమయం, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ అన్న వివరాలు పరిశీలిద్దాం.
వెస్టిండీస్ వర్సెస్ ఇండియా తొలి వన్డే:
►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్, వెస్టిండీస్
►తేది: జూలై 22, శుక్రవారం
►మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభం
►ప్రసారాలు: వెస్టిండీస్ వర్సెస్ ఇండియా వన్డే, టీ20 సిరీస్‌కు అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ ఫ్యాన్ కోడ్. భారత వాసుల కోసం మ్యాచ్‌లు ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం.
►అదే విధంగా.. డీడీ స్పోర్ట్స్‌లోనూ వీక్షించవచ్చు.
►కరేబియన్ల కోసం స్పోర్ట్స్‌మాక్స్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది.
పిచ్, వాతావరణం
క్వీన్స్ పార్క్ ఓవల్ వన్డేలకు అనువైన వేదిక. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. ఇక గురువారం వర్షం కారణంగా ధావన్ సేన ప్రాక్టీస్ ఇండోర్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం మాత్రం వర్ష సూచన లేదు.
Gearing up for ODI No.1 against the West Indies 💪
— BCCI (@BCCI) July 21, 2022
Here's @ShubmanGill giving a lowdown on #TeamIndia's 🇮🇳 first net session in Trinidad 🇹🇹#WIvIND pic.twitter.com/oxF0dHJfOI
తుది జట్ల అంచనా:
ఈ మ్యాచ్‌తో రుతురాజ్ గైక్వాడ్ టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం మెండు. కుడి, ఎడమ చేతివాటం ఓపెనింగ్ జోడీతో ఆడాలని భారత్ భావిస్తే ధావన్‌తో కలిసి రుతు ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంది. ఇక మోకాలి నొప్పి తిరగబెట్టిందన్న వార్తల నేపథ్యంలో జడేజా జట్టుకు దూరమైతే అక్షర్ పటేల్ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్/ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సంజూ సామ్సన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్.
వెస్టిండీస్:
నికోలస్ పూరన్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, బ్రూక్స్, మేయర్స్, హోప్, రోవ్‌మన్ పావెల్, హోల్డర్, అకీల్ హొసీన్ , జోసెఫ్, గుడకేశ్ మోటీ, జేడెన్ సీల్స్.
మీకు తెలుసా?
►2017 మార్చి నుంచి వెస్టిండీస్ సొంతగడ్డ మీద 12 ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడింది. ఇందులో కేవలం రెండు మాత్రమే విండీస్ గెలుచుకుంది. ఐర్లాండ్‌పై 2020లో.. శ్రీలంకపై 2021 మార్చిలో గెలుపు నమోదు చేసింది.
►ఇక వన్డేల విషయానికొస్తే.. 2006 మే తర్వాత వెస్టిండీస్ ఇంతవరకు టీమిండియాతో జరిగిన ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ కూడా గెలవలేదు. 11 సిరీస్‌లు గెలిచి టీమిండియా వెస్టిండీస్‌పై ఆధిపత్యం కొనసాగిస్తోంది.
►చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రోహిత్ సేన చేతిలో భారత్‌లో జరిగిన సిరీస్‌లో 3-0 తేడాతో వెస్టిండీస్ వైట్‌వాష్‌కు గురైంది. కాగా స్వదేశంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లనూ ఇదే తరహాలో క్లీన్‌స్వీప్‌కు గురైంది.
చదవండి: విండీస్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్?
Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు!
Comments
Please login to add a commentAdd a comment