వామ్మో.. ఇదేమి సిక్స్‌రా బాబు! దెబ్బకు స్టేడియం బయటకు బంతి | WI vs PNG: Nicholas Pooran smokes straight six out of ground | Sakshi
Sakshi News home page

T20 WC: వామ్మో.. ఇదేమి సిక్స్‌రా బాబు! దెబ్బకు స్టేడియం బయటకు బంతి

Published Mon, Jun 3 2024 8:31 AM | Last Updated on Mon, Jun 3 2024 8:43 AM

WI vs PNG: Nicholas Pooran smokes straight six out of ground

టీ20 వరల్డ్‌కప్‌-2024లో ఆతిథ్య వెస్టిండీస్‌ శుభారంభం చేసింది. ఆదివారం గయనా వేదికగా పాపువా న్యూ గినియా (PNG)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం విండీస్‌ విజయం సాధించింది. అయితే పీఎన్‌జీ విధించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిడానికి వెస్టిండీస్‌ తీవ్రంగా శ్రమించింది. 

137 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. అలై నౌ బౌలింగ్ లో జాన్సన్ చార్లెస్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత పూరన్, కింగ్‌ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. అయితే వరుసక్రమంలో వికెట్లు కోల్పోయి విండీస్‌ కష్టాల్లో పడింది. 

ఈ క్రమంలో రోస్టన్ చేజ్ చివ‌రివ‌ర‌కు క్రీజులో ఉండి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కరేబియన్‌ జట్టును గెలిపించాడు. రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్, 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

అతడితో పాటు నికోలస్ పూరన్ 27 పరుగులు, రోమ్ మన్ పావెల్ 15, ఆండ్రీ రస్సెల్ 15 పరుగులతో రాణించారు. అంతకముందు బ్యాటింగ్‌ చేసిన పపువా న్యూ గినియా 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 136 ప‌రుగులు చేసింది.

పూరన్‌ భారీ సిక్సర్‌.. 
ఇక ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ భారీ సిక్సర్‌ బాదాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌ 6 ఓవర్‌ వేసిన పీఎన్‌జీ స్పిన్నర్‌ బౌ.. తొలి బంతిని ఓవర్‌పిచ్‌ డెలివరీగా సంధించాడు. 

ఈ క్రమంలో పూరన్‌ ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి భారీ సిక్సర్‌ కొట్టాడు. పూరన్‌ పవర్‌కు బంతి ‍స్టేడియం బయటపడింది.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఆడనున్న సన్‌రైజర్స్‌ కెప్టెన్‌..

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement