SRH Definitely Lost Diamond, Twitter Hails Nicholas Pooran - Sakshi
Sakshi News home page

IPL 2023: దుమ్ము రేపుతున్నాడు.. సన్‌రైజర్స్‌ వదిలేసి పెద్ద తప్పు చేసింది! ఎవరంటే?

Published Fri, Apr 14 2023 11:56 AM | Last Updated on Fri, Apr 14 2023 12:27 PM

SRH Definitely Lost diamond, twitter hails Nicholas pooran - Sakshi

PC:IPL.com

ఐపీఎల్‌-2023లో వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ నికోలస్‌ పూరన్‌ దుమ్మురేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిద్యం వహిస్తున్న పూరన్‌.. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అందరని అకట్టుకుంటున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్స్‌లు సాయంతో 62 పరుగులు చేశాడు. ఈ క్రమం‍లో అతడు తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను కేవలం 15 బంతుల్లోనే అందుకున్నాడు.

తద్వారా ఈ ఏడాది సీజన్‌లో అత్యంత వేగవంతంగా హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా పూరన్‌ రికార్డులకెక్కాడు. లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న నికోలస్‌.. తన మెరుపు ఇన్నింగ్స్‌లతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో 36 పరుగులతో రాణించిన పూరన్‌.. అనంతరం చెన్నైపై 18 బంతుల్లో 32 పరుగులు చేసి మ్యాచ్‌ను చాలా దగ్గరగా తీసుకువెళ్లాడు.

దురదృష్టవశాత్తూ ఆ మ్యాచ్‌లో లక్నో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌పై కూడా కేవలం 6 బంతుల్లో 11 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన పూరన్‌ 141 పరుగులు చేశాడు.

                                                    

ఎస్‌ఆర్‌హెచ్‌ విడిచిపెట్టి తప్పు చేసిందా?
ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంలో పూరన్‌ను రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇంత భారీ దక్కించుకున్న పూరన్‌.. తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. గతఏడాది సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన పూరన్‌ 48.83 సగటుతో 263 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు హాఫ్‌ సెంచరీలు మాత్రమే ఉన్నాయి.

ఇక దారుణంగా విఫలమైన పూరన్‌ను ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్‌ విడిచిపెట్టింది. దీంతో మినీవేలం లోకి వచ్చిన పూరన్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ.16 కోట్లు వెచ్చించి మరి సొంతం చేసుకుంది. తన తీసుకున్న మొత్తానికి పూరన్‌ న్యాయం చేస్తున్నాడు.

ఇక లక్నో తరపున అదరగొడుతున్న పూరన్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ విడిచిపెట్టి పెద్ద తప్పు చేసింది అని ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. పూరన్‌ అద్భుతమైన ఆటగాడు అని, ఒక్క సీజన్‌కే విడిచిపెట్టడం సరికాదని సోషల్‌ మీడియాలో పోస్టు్‌లు చేస్తున్నారు.
చదవండి: IPL 2023: కేకేఆర్‌తో మ్యాచ్‌.. 13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్‌! సన్‌రైజర్స్‌ తుది జట్టు ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement