దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 175 పరుగుల లక్ష్య చేధనలో సఫారీ బౌలర్లను పూరన్ ఊచకోత కోశాడు.
కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 7 సిక్స్‌లు, 2 ఫోర్లతో 65 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా విండీస్ లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది.
సూర్యను అధిగమించిన పూరన్..
ఇక మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో పూరన్ మూడో స్ధానానికి ఎగబాకాడు. 96 టీ20ల్లో 139 సిక్స్‌లు బాదిన ఈ కరేబియన్ వీరుడు.. మోస్ట్ సిక్స్‌ల జాబితాలో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు.
ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(137), టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(136)ను పూరన్ అధిగమించాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో రోహిత్ శర్మ(205) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment