ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్దమవుతోంది. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశముంది. ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఆసీస్ సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. జోస్ ప్రస్తుతం కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు.
ఈ గాయం కారణంగానే ది హండ్రెడ్ టోర్నమెంట్‌కు సైతం దూరమయ్యాడు. అయితే అతడు ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం.
బట్లర్ తిరిగి మళ్లీ ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది.
ఈ జట్టుకు బట్లర్ సారథ్యం వహించినట్లు ఈసీబీ వెల్లడించింది. కానీ ఇప్పుడు బట్లర్ ఫిట్‌నెస్‌పై సందిగ్దం నెలకొనడంతో.. ఇంగ్లండ్ జట్టుకు సామ్ కుర్రాన్ సారథ్యం వహించే అవకాశముంది. కాగా సెప్టెంబర్ 11 ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: PAKvBAN: క్లీన్‌స్వీప్ దిశగా బంగ్లాదేశ్
Comments
Please login to add a commentAdd a comment