ఇంగ్లండ్ క్రికెట్‌లో ముసలం నెలకొంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్, టీమ్ కన్సల్టెంట్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో జట్టుతో విడిపోవాలని ఫ్లింటాప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వచ్చె నెలలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లకు ఇంగ్లండ్ కోచింగ్ స్టాప్‌లో భాగం కాకూడదని అతడు ఫిక్స్ అయినట్లు వినికిడి. ఇప్పటికే తన నిర్ణయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు కూడా ఈ లెజండరీ క్రికెటర్ తెలియజేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
గతేడాది నుంచి ఇంగ్లండ్ జట్టుకు తాత్కాలిక కన్సల్టెంట్‌గా ఫ్లింటాఫ్ పనిచేస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా ఈ ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ తన సేవలను అందించాడు. వరల్డ్‌కప్ సమయంలోనే ఫ్లింటాప్,బట్లర్‌కు గొడవలు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఫ్లింటాప్ నిర్ణయాలను బట్లర్ వ్యతిరేకించేవాడని, ఇద్దరి మధ్య సమన్వయం లోపించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ సీనియర్ టీమ్ కోచింగ్ స్టాప్ నుంచి బయటకు వెళ్లాలని ఫ్లింటాప్ నిర్ణయించుకున్నాడంట.
అతడు ఫ్రాంచైజీ క్రికెట్‌లో కోచింగ్‌పై దృష్టిపెట్టినట్లు మార్నింగ్ టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది. ఫ్లింటాఫ్ ప్రస్తుతం ది హండ్రెడ్ ఫ్రాంచైజీ నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్నాడు.
తాత్కాలిక హెడ్‌కోచ్‌గా ట్రెస్కోథిక్
ఇక వన్డే, టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విఫలమకావడంతో హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి మాథ్యూ మోట్ తప్పుకున్నాడు. ప్రస్తుతం తాత్కాలిక హెడ్ కోచ్‌గా బ్యాటింగ్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ బాధ్యతలు చేపట్టాడు. అయితే అతడిని త్వరలోనే పూర్తి స్ధాయి హెడ్‌కోచ్‌గా నియమించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment