తిలక్‌ వర్మ విరోచిత పోరాటం.. రెండో టీ20లో భారత్‌​ విజయం | India vs England 2nd T20I Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND vs ENG: తిలక్‌ వర్మ విరోచిత పోరాటం.. రెండో టీ20లో భారత్‌​ విజయం

Published Sat, Jan 25 2025 6:42 PM | Last Updated on Sat, Jan 25 2025 10:40 PM

India vs England 2nd T20I Live Updates And Highlights

India vs England 2nd T20I Live Updates And Highlights: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రెండో టీ20లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడుతున్నాయి.

తిలక్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌..
చెపాక్‌​ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 8 వికెట్లు కోల్పోయి చేధించింది. టీమిండియా విజయంలో హైదరాబాదీ తిలక్‌ వర్మ కీలక పాత్ర పోషించాడు. లక్ష్య చేధనలో క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటకి తిలక్‌ విరోచిత పోరాటం కనబరిచాడు.

ఆఖరివరకు క్రీజుల ఉండి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. తిలక్‌ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. భారత బ్యాటర్లలో తిలక్‌తో పాటు వాషింగ్టన్‌ సుందర్‌(26) రాణించాడు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్సే మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్‌, వుడ్‌, అర్చర్‌, ఓవర్టన్‌ తలా వికెట్‌ సాధించారు. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జోస్‌ బట్లర్‌(45) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్‌ కార్సే(31), జేమీ స్మిత్‌​(22) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ తలా వికెట్‌ సాధించారు.

18 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 153/8
18 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత విజయానికి కేవలం 12 బంతుల్లో 13 పరుగులు కావాలి.క్రీజులో తిలక్‌ వర్మ(63), రవి బిష్ణోయ్‌(5) ఉన్నారు.
ఏడో వికెట్‌ డౌన్‌..
టీమిండియా ఏడో వికెట్‌​ కోల్పోయింది. 2 పరుగులు చేసిన అక్షర్‌ పటేల్‌..లివింగ్‌ స్టోన్‌​ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

భారత్‌ ఆరో వికెట్‌ డౌన్‌..
వాషింగ్టన్‌ సుందర్‌ రూపంలో భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 26 పరుగులు చేసిన సుందర్‌.. బ్రైడన్‌ కార్సే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 119/6. భారత్‌ విజయానికి 6 ఓవర్లలో 47 పరుగులు కావాలి. క్రీజులో తిలక్‌ వర్మ(41), అక్షర్‌ పటేల్‌​(1) ఉన్నారు.

భారత్‌ ఐదో వికెట్‌ డౌన్‌.. పాండ్యా ఔట్‌
టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది.  8వ ఓవర్‌లో బ్రైడన్‌ కార్సే బౌలింగ్‌లో ధ్రువ్‌ జురెల్‌(4) ఔట్‌ కాగా.. 9వ ఓవర్‌లో ఓవర్టన్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యా(7) ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 79/5

మూడో వికెట్‌ డౌన్‌..
58 పరుగులు వద్ద భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. బ్రైడన్‌ కార్సే బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.  7 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 63-3, క్రీజులో తిలక్‌వర్మ(27), ధ్రువ్‌ జురెల్‌(3)ఉన్నారు.

భారత్‌ రెండో వికెట్‌ డౌన్‌..
భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సంజూ శాంసన్‌.. జోఫ్రా అర్చర్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చాడు. 3 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 28/2

తొలి వికెట్‌ డౌన్‌.. అభిషేక్‌ ఔట్‌
అభిషేక్‌ శర్మ రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 12 పరుగులు చేసిన అభిషేక్‌.. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులో తిలక్‌ వర్మ వచ్చాడు.

భారత టార్గెట్‌ ఎంతంటే?
చెపాక్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు రాణించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జోస్‌ బట్లర్‌(45) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్‌ కార్సే(31), జేమీ స్మిత్‌​(22) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ తలా వికెట్‌ సాధించారు.

ఏడో వికెట్‌ డౌన్‌..
ఇం‍గ్లండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన జెమ్మీ ఓవర్టన్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 16ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 136/7

ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ డౌన్‌..
104 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జేమీ స్మిత్‌.. అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కార్సే వచ్చాడు.

ఐదో వికెట్‌ డౌన్‌..
ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌​ కోల్పోయింది. 13 పరుగులు చేసిన లివింగ్‌ స్టోన్‌..అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 94/5

బట్లర్‌ ఔట్‌..
బట్లర్‌ రూపంలో ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 45 పరుగులు చేసిన బట్లర్‌.. అక్షర్ పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి స్మిత్‌ వచ్చాడు. 9.3 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 77/4

ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ డౌన్‌.. 
ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన బ్రూక్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి లివింగ్‌స్టోన్‌వచ్చాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌:61/3

ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ డౌన్‌.. డకెట్‌ ఔట్‌
బెన్‌ డకెట్‌ రూపంలో ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన డకెట్‌.. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి హ్యారీ బ్రూక్‌ వచ్చాడు. 4 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 35/2. క్రీజులో జోస్‌ బట్లర్‌(26), హ్యారీ బ్రూక్‌(1) ఉన్నారు.

ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ డౌన్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌(4)ను అర్ష్‌దీప్‌ సింగ్‌ పెవిలియన్‌కు పంపాడు. క్రీజులోకి కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ వచ్చాడు. మొదటి ఓవరు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోర్‌: 8/1

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రెండో టీ20లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసుకుంది. చెపాక్‌ టీ20లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి గాయం కారణంగా ఈ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు.

అదేవిధంగా రింకూ సింగ్‌ కూడా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. వీరిద్దరి స్ధానంలో ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వాషింగ్టన్‌ సుందర్‌​, ధ్రువ్‌జురెల్‌ వచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో కూడా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఆడటం లేదు. షమీ అందుబాటుపై కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. మరోవైపు ఇంగ్లండ్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాస్‌ అట్కినసన్‌, బెతల్‌ స్ధానంలో బ్రైడన్ కార్సే, జామీ స్మిత్‌లు వచ్చారు.

తుది జట్లు..
భారత్: సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్‌ కీపర్‌), జోస్ బట్లర్(కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్‌.. ఇంగ్లండ్‌ సిరీస్‌ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement