ICC WC 2023- Ind vs Eng: ‘‘జాతీయ మీడియా, సోషల్ మీడియాలో భారత్, పాకిస్తాన్ కామెంటేటర్లు పరస్పర దూషణలతో చెలరేగుతుంటే మరో వైపు అందమైన, మానవ సంబంధాల కథనం ఒకటి నేను చదివాను. దిగ్గజ క్రికెటర్ బిషన్‌సింగ్ బేడి సర్ చనిపోయినప్పుడు ఆయన మిత్రుడు, పాక్ మాజీ కెప్టెన్ ఇంతికాబ్ ఆలమ్ ఇది రాశారు. మామూలుగా నేను అంత తొందరగా భావోద్వేగానికి గురి కాను. కానీ ఇది నన్ను కదిలించింది.
ఈ రోజు భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌లు ఆడబోయే క్రికెటర్లు పేర్లు చూస్తే అంతా స్టార్లే కనిపిస్తారు. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. ఇంత పెద్ద లైనప్ ఉండి కూడా ఇంగ్లండ్ దాదాపు చివరి స్థానంలో కొనసాగుతోంది. భారత జట్టును చూస్తే నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి.
చివరి బెంచీలో ఉండే మేం ఆఖరి నిమిషంలో చదివేందుకు కిందా మీదా పడుతుంటే అదే సమయంలో మెరికల్లాంటి ఇతర విద్యార్థులు పరీక్షకు ముందు చాలా ప్రశాంతంగా, ఆడుతూ పాడుతూ కనిపించేవారు.
భారత్ కోణంలో ఈ ‘ఇంగ్లీష్ పరీక్ష’ చాలా సులువైంది అయితే ఇంగ్లండ్ మాత్రం కష్టాల్లో ఉంది. పిచ్‌కు స్పిన్‌కు అనుకూలిస్తే మాత్రం ఇవి రెట్టింపవుతాయి. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు.
వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ దుస్థితిని వివరిస్తూ.. ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్ అని పేర్కొన్నాడు. కాగా లక్నో వేదికగా రోహిత్ సేన బట్లర్ బృందంతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment