ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బట్లర్ కేవలం 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా బట్లర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 115 టీ20 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. 3011 పరుగులు చేశాడు.
బట్లర్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 23 ఫిప్టీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అదే విధంగా టీ20ల్లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా 1000 పరుగుల మైలురాయిని కూడా బట్లర్ అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(84)తో పాటు విల్ జాక్స్(37), బెయిర్ స్టో(21) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లో షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. రవూఫ్, వసీం తలా రెండు వికెట్లు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment