నాలుగో టీ20లో ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపు.. సిరీస్‌ కైవసం​ | India Vs England 4th T20I Live Score Updates, Highlights And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

నాలుగో టీ20లో ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపు.. సిరీస్‌ కైవసం​

Published Fri, Jan 31 2025 6:32 PM | Last Updated on Fri, Jan 31 2025 10:36 PM

India VS England 4th T20I Live Updates And Highlights

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ (జనవరి 31) జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్‌ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

భారత ఇన్నింగ్స్‌లో హార్దిక్‌, దూబేతో పాటు అభిషేక్‌ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్‌), రింకూ సింగ్‌ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించగా.. సంజూ శాంసన్‌ (1), తిలక్‌ వర్మ (0), సూర్యకుమార్‌ యాదవ్‌ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సాకిబ్‌ మహమూద్‌ 3, జేమీ ఓవర్టన్‌ 2, బ్రైడన్‌ కార్స్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (51) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (39), ఫిలిప్‌ సాల్ట్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో జేమీ ఓవర్టన్‌ (19) వేగంగా పరుగులు రాబట్టినప్పటికీ అప్పటికే ఇంగ్లండ్‌ ఓటమి ఖరారైపోయింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు జోస్‌ బట్లర్‌ (2), లివింగ్‌స్టోన్‌ (9), జేకబ్‌ బేతెల్‌ 96), బ్రైడన్‌ కార్స్‌ (0), జోఫ్రా ఆర్చర్‌ (0) నిరాశపరిచారు. భారత బౌలర్లలో హర్షిత్‌ రాణా (గాయపడిన శివమ్‌ దూబే స్థానంలో కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు), రవి బిష్ణోయ్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి 2, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
137 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో జేకబ్‌ బేతెల్‌ (6) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే 24 బంతుల్లో 45 పరుగులు చేయాలి.

ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
129 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి ప్రమాదకరంగా కనిపించిన హ్యారీ బ్రూక్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
గాయపడిన శివమ్‌ దూబే స్థానంలో కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హర్షిత్‌ రాణా డేంజరెస్‌ ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (9) వికెట్‌ పడగొట్టాడు. 12 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 99/4గా ఉంది. హ్యారీ బ్రూక్‌ (23), జేకబ్‌ బేతెల్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే 48 బంతుల్లో 83 పరుగులు చేయాలి. 

మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. బట్లర్‌ ఔట్‌
67 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో హర్షిత్‌ రాణాకు క్యాచ్‌ ఇచ్చి జోస్‌ బట్లర్‌ (2) ఔటయ్యాడు. 

టార్గెట్‌ 182.. 65 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌
182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 65 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత బెన్‌ డకెట్‌ను (39) రవి బిష్ణోయ్‌ ఔట్‌ చేయగా.. ఆతర్వాత ఫిల్‌ సాల్ట్‌ను (23) అక్షర్‌ పటేల్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 7.1 ఓవర్ల అనంతరం​ ఇంగ్లండ్‌ స్కోర్‌ 66/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 77 బంతుల్లో 116 పరుగులు చేయాలి. జోస్‌ బట్లర్‌, హ్యారీ బ్రూక్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

హార్దిక్‌, దూబే విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్‌
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారీ స్కోర్‌ (181/9) చేసింది. 12 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జట్టును హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్‌ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. 

వీరికి ముందు అభిషేక్‌ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్‌), రింకూ సింగ్‌ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్‌.. చివరి ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. 

చివరి ఓవర్‌ను జేమీ ఓవర్టన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్‌ (1), తిలక్‌ వర్మ (0), సూర్యకుమార్‌ యాదవ్‌ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సాకిబ్‌ మహమూద్‌ 3, జేమీ ఓవర్టన్‌ 2, బ్రైడన్‌ కార్స్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడి ఔటైన హార్దిక్‌
చాలాకాలం తర్వాత హార్దిక్‌ పాండ్యా తన స్థాయికి తగ్గట్టుగా బ్యాట్‌ను ఝులిపించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 30 బంతులు ఎదుర్కొన్న హార్దిక్‌ 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 166/6గా ఉంది. శివమ్‌ దూబే (43), అక్షర్‌ పటేల్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
79 పరుగుల వద్ద భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. బ్రైడన్‌ కార్స్‌ బౌలింగ్‌లో ఆదిల్‌ రషీద్‌కు క్యాచ్‌ ఇచ్చి రింకూ సింగ్‌ (30) ఔటయ్యాడు. 11 ఓవర్ల అనంతరం భారత్‌ స్కోర్‌ 79/5గా ఉంది. శివమ్‌ దూబే (13), హార్దిక్‌ పాండ్యా క్రీజ్‌లో ఉన్నారు. 

కష్టాల్లో భారత్‌
57 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో జేకబ్‌ బేతెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ (29) ఔటయ్యాడు. 8 ఓవర్ల అనంతరం భారత్‌ స్కోర్‌ 65/4గా ఉంది. రింకూ సింగ్‌ (26), శివమ్‌ దూబే (7) క్రీజ్‌లో ఉన్నారు. 

సాకిబ్‌ మహమూద్‌ విజృంభణ.. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌
ఇంగ్లండ్‌ సాకిబ్‌ మహమూద్‌ రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు బంతులకు సంజూ శాంసన్‌, తిలక్‌ వర్మ వికెట్లు తీసిన సాకిబ్‌.. ఓవర్‌ చివరి బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌ను (0) పెవిలియన్‌కు పంపాడు. శాంసన్‌, సూర్యకుమార్‌ తమ వైఫల్యాల పరంపరను కొనసాగించారు. అభిషేక్‌ శర్మ (11), రింకూ సింగ్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌
12 పరుగుల వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. సంజూ శాంసన్‌ (1) మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత బంతికే తిలక్‌ వర్మ కూడా డకౌటయ్యాడు. సాకిబ్‌ మహమూద్‌కు రెండు వికెట్లు దక్కాయి. జోఫ్రా ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్‌ చివరి రెండు బంతులకు అభిషేక్‌ శర్మ వరుసగా సిక్సర్‌, బౌండరీ బాదాడు.  

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌
పూణే వేదిక‌గా నాలుగో టీ20లో భార‌త్‌-ఇంగ్లండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ రెండు మార్పులు చేసింది. మార్క్‌ వుడ్‌ స్థానంలో సాకిబ్‌ మహమూద్‌.. జేమీ స్మిత్‌ స్థానంలో జేకబ్‌ బేతెల్‌ తుది జట్టులోకి వచ్చారు.

ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా మూడు మార్పులు చేసింది. షమీ స్థానంలో అర్షదీప్‌.. దృవ్‌ జురెల్‌ స్థానంలో రింకూ సింగ్‌.. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో శివమ్‌ దూబే తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధ్యింలో ఉన్న విషయం తెలిసిందే.

తుది జట్లు
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్‌ బేతెల్‌, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్‌ మహమూద్‌

భారత్: సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), రింకూ సింగ్‌, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement