Nathan Ellis Sends Back Jos Buttler with Brilliant Caught and Bowled - Sakshi
Sakshi News home page

IPL 2023: దురదృష్టం అంటే బట్లర్‌దే.. అస్సలు ఊహించి ఉండడు! వీడియో వైరల్‌

Published Thu, Apr 6 2023 3:23 PM | Last Updated on Thu, Apr 6 2023 3:44 PM

Nathan Ellis Sends Back Jos Buttler with Brilliant Caught and Bowled - Sakshi

ఐపీఎల్‌-2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమిపాలైంది.  అయితే ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ స్టార్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను దురదృష్టం వెంటాడింది. చేతివేలి గాయం కారణంగా బట్లర్‌ ఓపెనింగ్‌ కాకుండా.. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌ వచ్చాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే బట్లర్‌ తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 11 బంతుల్లో 19 పరుగులు చేసి మంచి ఊపుమీద ఉన్న బట్లర్‌కు ఊహించని షాక్‌ తగిలింది.

ఏం జరిగిందంటే?
రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ 6 ఓవర్‌ వేసిన నాథన్‌ ఎల్లీస్‌ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బౌండరీలగా మలిచాడు. అనంతరం మూడో బంతికి సింగిల్‌ తీసి బట్లర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఈ క్రమంలో నాలుగో బంతికి బట్లర్‌ ఆన్‌డ్రైవ్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని బట్లర్‌ ప్యాడ్‌కు తాకి గాల్లోకి లేచింది.

వెంటనే బౌలర్‌ ఎల్లీస్‌ డైవ్‌ చేస్తూ అద్భుతమైన రిటర్న్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 19 పరుగులు చేసిన బట్లర్‌ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా చేతి వేలి గాయంతో బాధపడుతున్న బట్లర్‌.. ఢిల్లీతో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Sanju Samson- Shikhar Dhawan: అన్నా.. ప్రతిసారీ గిట్లనే అయితాంది.. ఎందుకంటావ్‌?! సంజూ ట్వీట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement