IPL 2023, RR Vs PBKS: Who Is Prabhsimran Singh?, Punjab Opener Brilliant Innings Against Rajasthan Royals - Sakshi
Sakshi News home page

Prabhsimran Singh: రాజస్తాన్‌ బౌలర్లను ఉతికారేశాడు.. ఎవరీ ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌

Published Wed, Apr 5 2023 8:22 PM | Last Updated on Thu, Apr 6 2023 10:38 AM

IPL 2023: Who-Prabhsimran Singh Stunning Innings Vs Rajasthan Royals - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 2023లో పంజాబ్‌ కింగ్స్‌ నుంచి మరో బ్యాటర్‌ దూసుకొచ్చాడు. బుధవారం రాజస్తాన్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ ఓపెనర్‌ ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. బౌల్ట్‌, అశ్విన్‌,చహల్‌ లాంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను చీల్చి చెండాడిన ప్రబ్‌సిమ్రన్‌ 28 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ఐపీఎల్‌లో ప్రబ్‌సిమ్రన్‌కు ఇదే తొలి అర్థశతకం కావడం విశేషం. ఓవరాల్‌గా 34 బంతుల్లో 60 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ప్రబ్‌సిమ్రన్‌ ధాటికి పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌ స్కోరు 60 పరుగులకు పైగా నమోదయ్యింది. 


Photo: IPL Twitter

ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ ఆటకు ముగ్దులైన క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎవరితను అని ఆరా తీస్తున్నారు. వాస్తవానికి ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ గత మూడేళ్లుగా పంజాబ్‌ కింగ్స్‌ తరపునే కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు అతను మూడుసార్లు వేలానికి వెళితే.. మూడుసార్లు పంజాబ్‌ కింగ్స్‌ అతన్ని కొనుగోలు చేయడం ఆసక్తికరం.

ఇక 2000 ఆగస్టు 10న పాటియాలలో పుట్టిన ప్రబ్‌సిమ్రన్‌ 2018లో దేశవాలీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2022లో తొలి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడిన ఇతను 11 మ్యాచ్‌ల్లో 689 పరుగులు చేశాడు. 24 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 664 పరుగులు చేసిన ప్రబ్‌సిమ్రన్‌ 42 టి20 మ్యాచ్‌ల్లో 1179 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఏడు మ్యాచ్‌లాడి 87 పరుగులు చేశాడు.

చదవండి: 'రంజీ మ్యాచ్‌లనుకున్నావా.. ఇలా ఆడితే కష్టం'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement