
PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి బాధ నుంచి కోలుకోక ముందే రాజస్తాన్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. రాజస్తాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా బట్లర్ చేతి వేలుకు గాయమైంది. ఈ క్రమంలో అతడు రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ బ్యాటింగ్‌కు కూడా రాలేదు. అతడి స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఓపెనర్‌గా వచ్చాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బట్లర్ క్రీజులో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. అయినప్పటికీ 19 పరుగులతో పర్వాలేదనిపించాడు.
కాగా బట్లర్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా లేనట్లు రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ సమయంలో తెలిపాడు. అయితే చేతి వేలు గాయంతో బాధపడుతున్న బట్లర్‌ను ఢిల్లీతో మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వాలని రాయల్స్ మెనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ డోనవాన్ ఫెరీరాకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం
చదవండి: Prithvi Shaw: అసలే దారుణ వైఫల్యం.. పృథ్వీ షాకు మరో భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment