న్యూఢిల్లీ: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సత్తా చాటింది. శనివారం జరిగిన కీలక పోరులో పంజాబ్ 31 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (65 బంతుల్లో 103; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటిచేత్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
ఐపీఎల్‌లో అతనికి ఇది తొలి సెంచరీ సాధించడం విశేషం. శిఖర్ ధావన్ (7), లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (5), షారుఖ్ (2) చేతులెత్తేయగా... ప్రభ్‌సిమ్రన్‌కు స్యామ్ కరన్ (20) కాసేపు అండగా నిలిచాడు. అనంతరం హర్‌ప్రీత్ బ్రార్ (4/30) మాయాజాలంతో పంజాబ్ పైచేయి సాధించింది. హర్‌ప్రీత్ స్పిన్ ఉచ్చులో పడిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 136 పరుగులే చేయగలిగింది.
డేవిడ్ వార్నర్ (27 బంతుల్లో 54; 10 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే అర్ధసెంచరీతో జట్టు పరువు నిలిపాడు. ఎలిస్, రాహుల్ చహర్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’కు దూరమైన తొలి జట్టుగా నిలిచింది.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (బి) ముకేశ్ 103; శిఖర్ ధావన్ (సి) రోసో (బి) ఇషాంత్ 7; లివింగ్‌స్టోన్ (బి) ఇషాంత్ 4; జితేశ్ (బి) అక్షర్ 5; స్యామ్ కరన్ (సి) అమన్ హకీమ్ (బి) ప్రవీణ్ దూబే 20; హర్‌ప్రీత్ (సి) మార్ష్ (బి) కుల్దీప్ 2; షారుఖ్ రనౌట్ 2; సికందర్ రజా నాటౌట్ 11; రిషి ధావన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–10, 2–32, 3–45, 4–117, 5–129, 6–154, 7–165. బౌలింగ్: ఖలీల్ 4–0–36–0, ఇషాంత్ 3–0–27–2, అక్షర్ 4–0–27–1, ప్రవీణ్ దూబే 3–0–19–1, కుల్దీప్ యాదవ్ 4–0–32–1, మార్ష్ 1–0–21–0, ముకేశ్ 1–0–3–1.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‌ప్రీత్ 54; ఫిల్ సాల్ట్ (బి) హర్‌ప్రీత్ 21; మార్ష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహర్ 3; రోసో (సి) సికందర్ రజా (బి) హర్‌ప్రీత్ 5; అక్షర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహర్ 1; అమన్ హకీమ్ (సి) హర్‌ప్రీత్ (బి) ఎలిస్ 16; మనీశ్ పాండే (బి) హర్‌ప్రీత్ 0; ప్రవీణ్ దూబే (బి) ఎలిస్ 16; కుల్దీప్ యాదవ్ నాటౌట్ 10; ముకేశ్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 136. వికెట్ల పతనం: 1–69, 2–74, 3–81, 4–86, 5–86, 6–88, 7–118, 8–123. బౌలింగ్: రిషీ ధావన్ 1–0–10–0, స్యామ్ కరన్ 2–0–18–0, హర్‌ప్రీత్ 4–0–30–4, ఎలిస్ 4–0–26–2, అర్ష్దీప్ 4–0–32–0, రాహుల్ చహర్ 4–0–16–2, సికందర్ రజా 1–0–3–0.
ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్ VS బెంగళూరు (మ. గం. 3:30 నుంచి)
చెన్నైVS కోల్‌కతా (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment