
ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్‌కు సన్‌రైజర్స్‌తో రేపు (మార్చి 27) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌సీఏ నుంచి ఎన్‌ఓసీ లభించని కారణంగా తొలి మ్యాచ్‌కు (గుజరాత్) దూరంగా ఉండిన సూర్యకుమార్ యాదవ్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తుంది. ఎన్‌సీఏ స్కైకు ఇంకా ఎన్‌ఓసీ ఇవ్వలేదని సమాచారం.
ఇవాళ సాయంత్రలోగా ఎన్‌సీఏ సూర్యకుమార్‌కు ఎన్‌ఓసీ ఇవ్వకపోతే.. రేపటి మ్యాచ్‌కు అతను అందుబాటులోకి రావడం దాదాపుగా అసాధ్యమే. ముంబై తొలి మ్యాచ్‌లో స్కై లేని లోటు స్పష్టంగా కనిపించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ ఉండివుంటే ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి ఉండేది. రేపటి మ్యాచ్‌కు కూడా స్కై దూరమైతే అది ముంబై విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం.
Suryakumar Yadav didn't get the clearance from NCA to be fit for the IPL 2024. (Sports Tak).
— CricketMAN2 (@ImTanujSingh) March 26, 2024
- He will miss 2nd match for Mumbai Indians. pic.twitter.com/bcpsTFtcMC
కాగా, సూర్యకుమార్ గతకొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. స్కై ఇటీవలే పలు సర్జరీలు చేయించుకుని ప్రస్తుతం ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. స్కై ఐపీఎల్ ఆడాలంటే ఎన్‌సీఏ వైద్యుల అనుమతి తప్పనిసరి. వారు ఎన్‌ఓసీ ఇస్తేనే స్కైకు ఐపీఎల్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది.
ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్ హైదరాబాద్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో రేపు జరుగబోయే మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోబోతుంది. ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ప్రత్యర్దుల చేతుల్లో ఓడటంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ముంబై తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడగా.. సన్‌రైజర్స్ కేకేఆర్ చేతిలో పరాజయంపాలైంది. సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య రేపటి మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.