
హార్దిక్ పాండ్యా (PC: IPL/BCCI)
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ నాలుగో విజయం నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ వల్లే ముంబైకి ఈ గెలుపు సాధ్యమైంది.
తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకునే ప్రమాదం నుంచి ముంబై తప్పించుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశాడు.
సూర్యలాంటి విధ్వంసకర బ్యాటర్ తమ జట్టులో ఉండటం అదృష్టమంటూ అతడిని కొనియాడాడు. అదే విధంగా.. విజయానంతరం కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ నుంచి ఎదురైన ప్రశ్నకు హార్దిక్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా?
ప్లే ఆఫ్స్ రేసు గురించి మంజ్రేకర్ ప్రస్తావించగా.. ‘‘మీరు ఏ సమీకరణల గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అయితే, మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాలని అనుకుంటున్నాం’’ అని హార్దిక్ బదులిచ్చాడు.
ఇక సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘మేము 10- 15 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం. ఏదేమైనా మా బ్యాటర్లు అత్యద్భుతంగా ఆడారు. ఇక నేను కూడా ఈరోజు మెరుగ్గా బౌలింగ్ చేయగలిగాను.
అత్యుత్తమ బ్యాటర్
పరిస్థితులకు అనుగుణంగా నా వ్యూహాలను అమలు చేయగా సత్ఫలితాలు వచ్చాయి. ఇక ‘స్కై’ గురించి చెప్పేదేముంది. తనలోని అత్యుత్తమ బ్యాటర్ మరోసారి బయటకు వచ్చాడు.
ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఒత్తిడిలో కూరుకుపోయేలా చేశాడు. ఆత్మవిశ్వాసంతో అతడు బ్యాటింగ్ చేసిన తీరు మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా అతడి సొంతం’’ అని సూర్యకుమార్ యాదవ్‌పై హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు.
ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు:
👉వేదిక: వాంఖడే, ముంబై
👉టాస్: ముంబై.. బౌలింగ్
👉హైదరాబాద్ స్కోరు: 173/8 (20)
👉ముంబై స్కోరు: 174/3 (17.2)
👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 102 రన్స్- నాటౌట్).
చదవండి: తండ్రిని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన జూనియర్ బుమ్రా..!
💯 & winning runs in style
Suryakumar Yadav hits a maximum to bring up his century 👏
Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024