టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను కాదని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ నియమించింది. అంతేకాకుండా భారత జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా పాండ్యాను బీసీసీఐ తప్పించింది.
అతడి స్ధానంలో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మ తర్వాత టీ20ల్లో భారత జట్టు సారథిగా పాండ్యా బాధ్యతలు చేపడతాడని అంతా భావించారు.
కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం సూర్యకుమార్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం సూర్యకుమార్‌కు మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇదే విషయంపై క్రీడా వర్గాల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. అస్సలు ఎందుకు హార్దిక్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయలేదన్న సందేహం అందరిలో నెలకొంది.
కారణమిదేనా?
ఫిట్‌నెస్ సమస్య కారణంగానే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించకపోయినట్లు సమాచారం. పాండ్యా ఎప్పటికప్పుడు గాయాల బారిన పడుతుండంతో దీర్ఘకాలిక ప్రణాళికల దృష్ట్యా సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడ్డ పాండ్యా.. దాదాపు 6 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఐపీఎల్-2024తో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో కూడా పాండ్యా తన మార్క్‌ను చూపించలేకపోయాడు.
గాయాల కారణంగా వర్క్‌లోడ్‌ను పాండ్యా మెనెజ్ చేయలేడని అజిత్ అగర్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ భావించినట్లు తెలుస్తోంది. అదే విధంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం ఆటగాళ్లు అన్ని ఫార్మాట్‌ల్లో ఆడేందుకు సిద్దంగా ఉండాలని ఇప్పటికే సృష్టం చేశాడు. ఈ క్రమంలోనే హార్దిక్‌కు డిమోషన్ లభించినట్లు వినికిడి.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment