
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వరుస పరాజయాలతో (హ్యాట్రిక్) సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు శుభవార్త తెలిసింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ముంబై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. ఎన్‌సీఏ వైద్యులు స్కైకు ఫిట్‌నెస్ క్లియెరెన్స్ ఇచ్చినట్లు సమాచారం.
ఏప్రిల్ 7న (ఆదివారం) ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్ సమయానికి స్కై వంద శాతం ఫిట్‌గా ఉంటాడని ఎన్‌సీఏకి చెందిన కీలక అధికారి వెల్లడించాడు. సూర్యకుమార్ గాయం కారణంగా ప్రస్తుత సీజన్‌లో ముంబై ఆడిన మొదటి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్కై గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో సూర్య లేని లోటు స్పష్టంగా కనిపించింది.
మడమ, స్పోర్ట్స్ హెర్నియా సర్జరీల కారణంగా సూర్యకుమార్ యాదవ్ గత నాలుగు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రెండు సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసుకున్న స్కై.. మార్చి నుంచి ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు స్కైకు ఫిట్‌నెస్ పరీక్ష చేయగా అందులో విఫలమయ్యాడు. తిరిగి జరిపిన మరో రెండో పరీక్షల్లో స్కై పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తేలడంతో ఎన్‌సీఏ అతనికి ఐపీఎల్ అడేందుకు అనుమతిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment