
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్న భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రికార్డును సూర్యకుమార్ సమం చేశాడు. పల్లెకెల్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన సూర్య.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 125 టీ20లు ఆడిన కోహ్లి 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా.. సూర్య కూడా సరిగ్గా 16 సార్లు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
అయితే సూర్య ఈ ఘనతను కేవలం 69 మ్యాచ్‌లల్లోఅందుకోవడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై 43 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యం సాధించడంలో లంక విఫలమైంది. 19.2 ఓవర్లలో 170 పరుగులకు శ్రీలంక ఆలౌటైంది.
భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో నిస్సాంక(79) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(58) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. పంత్(49), జైశ్వాల్(40) పరుగులతో రాణించారు. లంక పేసర్ మతీషా పతిరానా 4 వికెట్లతో సత్తాచాటాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 పల్లెకెలె వేదికగా ఆదివారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment