ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఎంపిక చేసిన భారత జట్టులో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. టీ20ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సూర్యకుమార్.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు.
తనకు వచ్చిన అవకాశాలను సూర్య సద్వినియోగపరుచుకోలేకపోయాడు. దీంతో అతడిని వన్డే ఫార్మాట్‌కు సెలక్టర్లు పక్కన పెట్టారు. టీ20ల్లో భారత జట్టు రెగ్యూలర్ కెప్టెన్‌గా ఉన్నప్పటికి.. వన్డేలకు మాత్రం సూర్యను పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి సూర్యను ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు.
తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20కు ముందు విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కనందుకు మీరు బాధపడ్డారా? అన్న ప్రశ్న మిస్టర్ 360కు ఎదురైంది.
"నేనేమి బాధ పడడం లేదు. వన్డే ఫార్మాట్‌లో బాగా రాణించి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉండేవాడిని. నేను ఆ పని చేయలేకపోయాను కాబట్టి నాకు అవకాశం దక్కలేదు. మన తప్పిదాన్ని అంగీకరించడం ముఖ్యం. అయితే నాకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయినందుకు బాధగా ఉంది. అదే నేను బాగా ఆడి ఉండే వన్డే జట్టులో కూడా కొనసాగేవాడిని.
ఛాంపియన్స్ ట్రోపీకి ఎంపిక చేసిన జట్టు చాలా బాగుంది. జట్టులో ఉన్న వారంతా అద్భుతమైన ఆటగాళ్లు. వన్డే ఫార్మాట్‌లో భారత్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చారు. దేశవాళీ క్రికెట్‌లో కూడా రాణించారు. కాబట్టి వారందరూ జట్టు సెలక్షన్‌కు ఆర్హులే" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ పేర్కొన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి
చదవండి: IND vs ENG: వరల్డ్ రికార్డుపై కన్నేసిన తిలక్ వర్మ..
Comments
Please login to add a commentAdd a comment