కెప్టెన్‌గా అదుర్స్‌.. తొలి మ్యాచ్‌లోనే సూర్య ఊచ‌కోత‌ | Captain Surya kumar Yadav Smashes His 2nd Fastest T20I Fifty | Sakshi
Sakshi News home page

IND vs SL: కెప్టెన్‌గా అదుర్స్‌.. తొలి మ్యాచ్‌లోనే సూర్య ఊచ‌కోత‌

Published Sat, Jul 27 2024 10:21 PM | Last Updated on Sat, Jul 27 2024 10:21 PM

Captain Surya kumar Yadav Smashes His 2nd Fastest T20I Fifty

శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సత్తాచాటాడు. టీమిండియా ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా మొదటి మ్యాచ్‌లోనే సూర్యకుమార్ తన విశ్వరూపాన్ని చూపించాడు. శుబ్‌మన్ గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 

లంక బౌలర్లను ఈ ఇండియన్‌ మిస్టర్ 360 ఊచకోత కోశాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను సూర్య అలరించాడు. కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్యకుమార్‌.. 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 213 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (58 ప‌రుగులు) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. య‌శ‌స్వీ జైశ్వాల్‌(40), రిష‌బ్ పంత్‌(49), శుబ్‌మ‌న్ గిల్‌(34) ప‌రుగుల‌తో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌల‌ర్ల‌లో మ‌తీషా ప‌తిరాన 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మ‌ధుషంక‌, హ‌స‌రంగా, ఫెర్నాండో త‌లా వికెట్ సాధించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement