ఎన్నో ఆశలు పెట్టుకున్నాము.. ఇలా చేస్తావ‌ని అనుకోలేదు!డ‌కౌట్‌గా | Suryakumar Yadav dismissed for two-ball duck in competitive cricket return | Sakshi
Sakshi News home page

#Suryakumar: ఎన్నో ఆశలు పెట్టుకున్నాము.. ఇలా చేస్తావ‌ని అనుకోలేదు! డ‌కౌట్‌గా

Published Sun, Apr 7 2024 5:15 PM | Last Updated on Sun, Apr 7 2024 5:30 PM

Suryakumar Yadav dismissed for two-ball duck in competitive cricket return - Sakshi

ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న రీఎంట్రీ మ్యాచ్‌లో తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. గ‌త రెండు నెల‌ల‌గా ఆట‌కు దూరంగా ఉన్న సూర్య‌కుమార్‌.. ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో  మ్యాచ్‌తో పున‌రాగమ‌నం చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్య దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

రీ ఎంట్రీలో స‌త్తాచాటాతుడాని భావించిన ముంబై అభిమానుల ఆశ‌ల‌ను మిస్ట‌ర్ 360 ఆడియాశలు చేశాడు. ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన సూర్య‌కుమార్ సిల్వ‌ర్ డ‌క్‌గా వెనుదిరిగాడు. రెండు బంతులు ఎదుర్కొన్న ఈ ముంబైక‌ర్ అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు.

మిడాన్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌కు క్యాచ్ ఇచ్చి సూర్య ఔట‌య్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఏంటి సూర్య భ‌య్యా ఇలా చేశావు.. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాము అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement