
సంజూ శాంసన్.. ఎప్పుడు జట్టులో ఉంటాడో? ఎప్పుడు డగౌట్‌లో కూర్చుంటాడో ఎవరికి తెలియదు. గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నప్పటికి శాంసన్‌ను మాత్రం దురుదృష్టం వెంటాడుతూనే ఉంది. జింబాబ్వే సిరీస్‌లో సత్తాచాటి శ్రీలంకకు పయనమైన సంజూకు మరోసారి నిరాశే ఎదురైంది. లంకతో తొలి టీ20కు భారత తుది జట్టులో శాంసన్‌కు చోటు దక్కలేదు.
అతడి స్ధానంలో స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు జట్టు మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. కనీసం టాప్ ఆర్డర్ బ్యాటర్‌గానూ సంజూను పరిగణలోకి తీసుకోలేదు. జింబాబ్వే సిరీస్‌లో విఫలమైన పరాగ్‌కు ఈ మ్యాచ్‌కు అవకాశమిచ్చి.. సంజూను పక్కన పెట్టడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు.
శాంసన్ వరల్డ్‌లోనే మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ జట్టులో సంజూతో పాటు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లకు సైతం చోటు దక్కలేదు.
శ్రీలంకతో తొలి టీ20కు భారత తుది జట్టు ఇదే..
శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్