
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. శ్రీలంకను 161 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. 31 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయ్ మూడు, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ పెరీరా (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పథుమ్ నిస్సంక (32), కమిందు మెండిస్ (26), చరిత్ అసలంక (14), రమేశ్ మెండిస్ (12), కుశాల్ మెండిస్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. నిన్న జరిగిన తొలి టీ20లోనూ శ్రీలంక ఈ మ్యాచ్‌లోలాగే చివరి వికెట్లు స్వల్ప వ్యవధిలో కోల్పోయింది. నిన్నటి మ్యాచ్‌లో ఆ జట్టు చివరి 9 వికెట్లు 30 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment