శ్రీలంకతో టీ20 సిరీస్‌పై టీమిండియా కన్నేసింది. 24 గంటలు తిరగకముందే మరో మ్యాచ్‌కు భారత్ సిద్దమైంది. ఆదివారం పల్లెకెలె వేదికగా జరగనున్న రెండో టీ20లో భారత్-శ్రీలంక జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. లంక మాత్రం ఎలాగైనా కమ్‌బ్యాక్ ఇచ్చి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.
అయితే సెకెండ్ టీ20లో భారత తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో గాయపడిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రెండో మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రిటర్న్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బిష్ణోయ్ ముఖానికి గాయమైంది. రక్తం రావడంతో వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు.
ఆ తర్వాత తన బౌలింగ్‌ను బిష్ణోయ్ కంటిన్యూ చేశాడు. కానీ ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు మహ్మద్ సిరాజ్‌ను కూడా ఈ మ్యాచ్‌కు రెస్ట్ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.
అతడి స్ధానంలో పేసర్ ఖాలీల్ ఆహ్మద్ జట్టులో రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. మరోవైపు శ్రీలంక కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశముంది. పేసర్ మధుషంక స్ధానంలో ఆల్‌రౌండర్ చమిందు విక్రమసింఘేకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు లంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
తుది జట్లు(అంచనా)
భారత్: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ఖాలీల్ ఆహ్మద్
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), వనిందు హసరంగా, దసున్ షనక, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో, చమిందు విక్రమసింఘే
Comments
Please login to add a commentAdd a comment